రాజధానిలో రేపు సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన

Metro Mat News correspondent Jayraju :-అమరావతి :- అమరావతి రాజధాని ప్రాంతంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. 

గురువారం తన నివాసం నుండి ఉదయం 11 గంటలకు పర్యటనకు బయలుదేరుతారు. ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి సీఎం పర్యటనను ప్రారంభించనున్నారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుండి సీడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయ మూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలు పెట్టిన సైట్ లను కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. పర్యటన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతారు.

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

अहिंसा परमो धर्मः परंतु सेवा भी परमो धर्म है :- आचार्य प्रमोद कृष्णम

हर्षोल्लास से सम्पन्न हुई महकपाल सिंह जयन्ती-समारोह

भीषण गर्मी के कारण अधिवक्ता रामदयाल पांडे की हुई मौत